సర్.. కాపాడండి - వైఎస్. జగన్‌ను కలిసిన రమణ దీక్షితులు
గురువారం, 7 జూన్ 2018 (19:31 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు కలిశారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో జగన్‌ను కలిశారు.
టీటీడీలో అవినీతి, అక్రమాలు, ఆగమశాస్త్ర ఉల్లంఘనలు జరుగుతున్నాయని రమణ దీక్షితులు గతంలో సంచలన ఆరోపణలు చేశారు. గతంలోనే రమణ దీక్షితులకు జగన్ మద్దతుగా కూడా నిలిచారు. వీరిద్దరి భేటీ తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.