హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుతో రాయలసీమకు నీరు తీసుకురావడం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఆ ప్రాంత వాసులు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చంద్రబాబుకు తమ కృతజ్ఞతలు తెలిపేందుకు హంద్రీనీవా సుజల స్రవంతి నీటితో ఆయన చిత్ర పటాన్ని రూపొందించారు.
ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. హంద్రీనీవా సుజల స్రవంతి పథకంతో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను రాయలసీమ కరువు ప్రాంతాలకు అందించేందుకు 1,649 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోస్తున్నారు.
ఈ పథకం కాలువల పొడవునా 19 నియోజకవర్గాల్లో 423 చెరువులను కృష్ణా జలాలతో నింపుతున్నారు. ఈ చెరువులన్నీ నింపితే 13.004 టీఎంసీలు నిల్వ కానుంది. వాటి కింద 71,765 ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది.
తాజాగా ఎన్డీయే ప్రభుత్వంలో ఆరు నెలలో జరిగిన పనుల్లో కుప్పం బ్రాంచి కాలువ చివర రామసముద్రం చెరువు వరకు కృష్ణమ్మ చేరింది. ఇంకా చంద్రాబు కుప్పం నియోజకవర్గంలో శనివారం గంగపూజ చేయబోతున్నారు.
హంద్రీనీవా సుజల స్రవంతి నీటితో సీఎం చంద్రబాబు చిత్రం..
రాయలసీమకు నీరు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వినూత్నంగా ధన్యవాదాలు తెలిపిన యువకులు