అక్కిరెడ్డి గూడెంలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి

గురువారం, 14 ఏప్రియల్ 2022 (09:28 IST)
ఏపీలోని ఏలూరు జిల్లాలో అక్కిరెడ్డి గూడెంలో చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదంలో ఆరు కార్మికులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. అక్కిరెడ్డిగూడెంలో ఉన్న పోరస్‌ కెమికల్‌ ఫ్యాక్టరీలోని నాలుగో యూనిట్‌లో బుధవారం రాత్రి 10 గంటల సమంలో ఒక్కసారిగా రియాక్టర్‌ పేలిపోయింది. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. 
 
ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక, పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది సుమారు రెండున్నర గంటలపాటు శ్రమించాల్సి వచ్చింది.
 
ఐదుగురు అక్కడికక్కడే సజీవదహనం అయ్యారని పోలీసులు తెలిపారు. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారని చెప్పారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ దవాఖానకు తరలించామన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు