నవ్యాంధ్రప్రదేశ్‌లో ఘనంగా తొలి గణతంత్ర వేడుకలు!

సోమవారం, 26 జనవరి 2015 (11:47 IST)
నవ్యాంధ్రప్రదేశ్‌లో తొలి గణతంత్ర వేడుకులు అట్టహాసంగా జరిగాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రిపబ్లిక్ డే వేడుకలు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగాయి. ఈ 66వ రిపబ్లిక్ వేడుకలో గవర్నర్ నరసింహన్ హాజరయ్యారు. 
 
రాష్ట్ర గవర్నర్ నరసింహన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య పుట్టిన ప్రాంతంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. 
 
స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ గణతంత్ర వేడుకలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు తదితరులు పాల్గొన్నారు. 

వెబ్దునియా పై చదవండి