జనసేన తీర్థం పుచ్చుకున్న మాజీ ఐఏఎస్ అధికారి

శుక్రవారం, 24 జూన్ 2022 (10:10 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ హోదాల్లో 30 యేళ్ల పాటు ఐఏఎస్ అధికారిగా సేవలు అందించిన వరప్రసాద్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన జనసేన పార్టీలో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ సభ్యత్వం స్వీకరించారు. 
 
తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం దిండి గ్రామానికి చెందిన వరప్రసాద్ ఐఏఎస్ అధికారిగా సేవలు అందించారు. ఆయన జనసేనలో గురువారం చేరారు. హైదరాబాద్ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తదితర నేతలు పాల్గొన్నారు.
 
ఇదిలావుంటే, 2024లో ఏపీ అసెంబ్లీతో పాటు సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. అదేసమయంలో జనసేనలో చేరేందుకు అనేక మంది నేతలు పోటీ పడుతున్నారు. ఇందులోభాగంగా, మాజీ ఐఏఎస్ అధికారి దేవ వరప్రసాద్ ఆ పార్టీలో చేరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు