దొంగ సొమ్మును పంచుకోవడానికి ఇద్దరూ కుమ్మక్కైయ్యారని, బీజేపీ, టీఆర్ఎస్ తోడుదొంగలని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన మండిపడ్డారు.
మాణిక్కం ఠాగూర్‌తో తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ దోపిడీని బీజేపీ చూసిచూడనట్లు వ్యవహరించడంవల్ల, బీజేపీకి ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో నిధులను కేసీఆర్ సమకూర్చుతున్నారన్నారు.
సింగరేణి దోపిడీపై సీబీఐ చేత పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరుతూ ఇచ్చిన విజ్ఞప్తిపై ప్రధాని వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఆదానీ సంస్థకు అనుకూలంగా నిబంధనలు రూపొందించారని, ఎన్నో సార్లు ఫిర్యాదులు చేసినా, కేంద్రానికి 49 శాతం వాటాలున్నా, కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదుపై ప్రధాని మోడి పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు.