విశాఖ ఉక్కు పరిశ్రమపై బిజెపి నోరు విప్పాలి: రోజా

శనివారం, 6 ఫిబ్రవరి 2021 (19:06 IST)
రాష్ట్రవ్యాప్తంగా ఉక్కు పరిశ్రమ ఉద్యమం ప్రారంభమైంది. విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్రం ప్రైవేటుపరం చేయకూడదంటూ ప్రజా సంఘాలన్నీ కదం తొక్కాయి. ఒక్కో పార్టీ ఒక్కో విధంగా ఈ వ్యవహారంపై స్పందిస్తున్నాయి. అయితే ఎపిఐఐసి ఛైర్ పర్సన్ రోజా ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు.
 
తిరుపతిలో మీడియతో మాట్లాడిన రోజా విశాఖ ఉక్కు పరిశ్రమపై బిజెపి ముందు మాట్లాడాలన్నారు. గతంలో బిజెపి నేతలే దీనిపై తీవ్రంగా స్పందించారని.. కాబట్టి వారే విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేయకుండా ఆపాలన్నారు. ఆ బాధ్యత బిజెపి రాష్ట్రనేతలు తీసుకుంటే కేంద్రం ఖచ్చితంగా స్పందిస్తుందన్నారు రోజా. 
 
అంతేకాకుండా విశాఖ ఉక్కుపై వైసిపి ముందు నుంచి ఒకే స్టాండ్‌తో ఉందని, అయితే కావాలనే ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం టిడిపితో పాటు మిగిలిన పార్టీలు మానుకోవాలన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు