టీడీపీ-కాంగ్రెస్ పొత్తు చూసి ఏపీ ప్రజలు చీదరించుకుంటున్నారని రోజా వ్యాఖ్యానించారు. టీడీపీని చంద్రబాబు తెలుగు దాల్ పప్పుగా మార్చేశారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై గుంటూరులో చెప్పులు వేయించిన చంద్రబాబు, ఇటీవల ఢిల్లీలో ఆయన చెప్పులను తలపై పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.
నటుడు శివాజీ చెప్పిన ఆపరేషన్ గరుడ వ్యవహారంపై రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శివాజీ చెప్పినవి చెప్పినట్లు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. సీఎంపై దాడి జరుగుతుందని కూడా శివాజీ చెప్పాడన్నారు. అలాంటి వ్యక్తిపై చర్యలు తీసుకోకుండా.. ఏపీ పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులు దున్నపోతు నుంచి పాలు పితుకుతున్నారా? అని ప్రశ్నించారు. డీజీపీ ఆర్పీ ఠాకూర్, ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావులను చంద్రబాబు పక్కన కూర్చోబెట్టుకుని ఆపరేషన్ గరుడపై మాట్లాడటం సిగ్గుచేటన్నారు.