విమర్శలు చేస్తే గ్యాంగ్ రేప్ చేస్తారట... గోవా కాంగ్రెస్ మహిళా నేత ఫిర్యాదు

సోమవారం, 5 నవంబరు 2018 (12:26 IST)
గోవా రాష్ట్రంలో అధికారిక భారతీయ జనతా పార్టీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. ఏకంగా ఆ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నేతలకే వారు వార్నింగ్‌లు ఇస్తున్నారు. తమ పార్టీ నేత సుభాష్ శిరోద్కర్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే సామూహిక అత్యాచారం చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. 
 
ఈ మేరకు గోవా మహిళా కాంగ్రెస్ స్టేట్ సెక్రటరీ దియా షెట్కర్ తెలిపారు. ఈ బెదిరింపులపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో ఆదివారం ఉదయం ఓ ఫోన్ కాల్ వచ్చిందనీ, అవతలి వ్యక్తి షిరోద్కర్ మద్దతుదారుడిగా పేర్కొని.. అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ దూషణలకు పాల్పడినట్టు పేర్కొంది.
 
అంతేకాకుండా, శిరోద్కర్ నియోజకవర్గంలో కాలుమోపవద్దని.. అలా చేస్తే సామూహిక అత్యాచారానికి పాల్పడతామని పేర్కొన్నట్లుగా ఆమె తెలిపింది. పోలీసులు తక్షణం స్పందించి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా దియా కోరారు. కాగా దియా షెట్కర్ ఆరోపణలపై సుభాష్ శిరోద్కర్ ఇంతవరకు స్పందించక పోవడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు