ఫైర్ బ్రాండ్ రోజా మరోసారి ఫైరయ్యారు. ఎపిఐఐసి కార్యాలయం వేదికగా ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్సి లోకేష్ పైన తీవ్రస్థాయిలో విమర్సలు చేశారు. కరోనా సమయంలో రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు తెలుగుదేశం నేతలు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు.
తినింది అరక్క ఏదో ఒకటి మాట్లాడుతూ.. జూమ్ మీటింగ్లో ఇష్టానుసారం ప్రభుత్వంపై ముద్దపప్పు లోకేష్ విమర్సలు చేయడం సరైంది కాదన్నారు. రాష్ట్రంలోని వాళ్ళందరినీ ముద్దపప్పు అవ్వాలని లోకేష్ పోరాటం చేస్తున్నట్లు ఎద్దేవా చేశారు. ప్రస్తుతం 6 శాతానికి కరోనా తగ్గిందని కాబట్టి పరీక్షలపై నిర్ణయం ఇంకా ప్రభుత్వం తీసుకోలేదన్నారు.