కుక్కతో మాజీ భర్త: ఊఫ్ అంటూ హీరోయిన్ కామెంట్

బుధవారం, 2 జూన్ 2021 (20:59 IST)
బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమావాళ్లు పెళ్లిళ్లు చేసుకోవడం, విడిపోవడం మామూలే. ఈమధ్య డేటింగులతోనే ఫుల్ స్టాప్ పెట్టేసేవారు ఎక్కువయ్యారు.
 
ఇక అసలు విషయానికి వస్తే... ఎనిమిది సంవత్సరాల క్రితం తన భర్త నుంచి విడాకులు తీసుకున్న హీరోయిన్ అదితీరావు హైదరీ చేసిన కామెంట్ ఇప్పుడు వైరల్ అయ్యింది. తన మాజీ భర్త సత్యదీప్ పెంపుడు కుక్కను గుండెలపై పడుకోబెట్టుకుని దిగిన ఫోటో ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసాడు. ఈ ఫోటోను చూసిన అదితి... ఊఫ్ అంటూ కామెంట్ పెట్టింది.
 
ఈ ఒక్క పదానికి ఆమె అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. డబుల్ మీనింగ్ డైలాగులతో సైతం పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి మాజీ భర్త ఫోటోపై చేసిన కామెంటుకి ఇంత రియాక్షన్ వస్తుందని అదితి ఊహించి వుండదేమో?

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు