కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

సెల్వి

శుక్రవారం, 17 మే 2024 (11:33 IST)
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈసారి ఉండి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు.  పోలింగ్ ముగిసిన అనంతరం ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆర్ఆర్ఆర్ మీడియాతో మాట్లాడారు. 
 
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ+ కూటమి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. ఏపీలో చంద్రబాబును మళ్లీ సీఎంగా చూడాలని ప్రజానీకం కోరుకుంటున్న నేపథ్యంలో ఏపీలో స్పష్టమైన ధోరణి కనిపిస్తోందని పేర్కొన్నారు.
 
అయితే ఇదే ఎన్నికల్లో వైసీపీ 25 ఎమ్మెల్యే సీట్లకు మించదన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ తుడిచిపెట్టుకుపోతుందని చెప్పారు. గత ఐదేళ్లలో జగన్ చేసిన అధ్వాన్న పరిపాలన ఫలితం జగన్‌ను వెంటాడుతుందని మాజీ ఎంపీ వ్యాఖ్యానించారు.
 
 
 
టీడీపీ+ కూటమి అధికారంలోకి వస్తే ఆర్‌ఆర్‌ఆర్‌ని ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా ప్రకటించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు