అన్ని ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి, తిరుమలకు మాత్రం?

గురువారం, 21 మే 2020 (20:28 IST)
రాష్ట్ర ప్రభుత్వ లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో రాష్ట్రరోడ్డు రవాణా సంస్ధ అధికారులు బస్సులను రోడ్లపై నడుపుతున్నారు. ఉదయం 7గంటల నుంచే బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఆధ్మాత్మిక క్షేత్రం తిరుపతి లాంటి ప్రాంతంలో అయితే మొత్తం 115 బస్సులు నడుస్తున్నాయి. 
 
గతంలో తిరుపతి బస్టాండులో ప్రతిరోజు 30 నుంచి 40 వేల మంది ప్రయాణీకులు రాకపోకలు సాగించేవారు. వారిలో 75శాతంకి పైగా పుణ్యక్షేత్రాల సందర్సనకు వచ్చేవారే. అయితే రెండు నెలల పాటు లాక్ డౌన్.. ఆలయాలను మూసివేసిన నేపథ్యంలో ప్రస్తుతం చిత్తూరు జిల్లాలోని పుణ్యక్షేత్రాలకు బస్సులను నడపటం లేదు. 
 
ముఖ్యంగా తిరుమల పుణ్యక్షేత్రానికి 400కి పైగా సర్వీసులు ప్రతిరోజు నడుస్తుంటాయి. అలాంటిది ప్రస్తుతం తిరుమల బస్టాండ్ ఖాళీగా కనిపిస్తోంది. తిరుమల ఆలయంలోకి భక్తులను అనుమతిని నిలిపివేయడం.. తిరుమల ఘాట్ రోడ్లను రెండింటిని మూసివేయడంతో బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. 
 
దీంతో తిరుమలతో పాటు తిరుచానూరు, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీనివాసమంగాపురం ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులను నడపటం లేదు. ఏడుకొండల బస్టాండ్‌లో ఇసుకేస్తే రాలనంత జనం ఎప్పుడూ కనబడుతూ ఉంటుంది. ఎప్పుడూ  ప్రయాణీకుల రద్దీ ఈ ప్రాంతంలో కనిపిస్తుంటుంది. అయితే పరిమిత సంఖ్యలోనే బస్సులు నడుపుతుండడం.. రెండు నెలల క్రితం తిరుపతికి వచ్చిన వారు తిరిగి వెళ్ళలేక ఇక్కడే ఉండిపోవడం.. వారు మాత్రమే ఆన్ లైన్ ద్వారా టిక్కెట్లను బస్సులను బుక్ చేసుకుని గమ్యస్థానాలకు చేరుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు