ఈ నేపథ్యంలో, విద్యాసంస్థలకు దసరా సెలవులను మరోసారి పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల 19 వరకు సెలవులు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి అక్టోబరు 14 నుంచి తెలంగాణలో పాఠశాలలు తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ సమ్మె కొనసాగుతుండడంతో 15వ తేదీ వరకు సెలవులు పొడిగించారు.
కానీ పరిస్థితిలో మార్పు రాకపోవడంతో మరోసారి సెలవులు పొడిగించక తప్పలేదు. ఈ నేపథ్యంలో, అదనపు బస్సులు సమకూర్చుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కాగా, ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం తర్వాత ఆయన సెలవులను పొడగించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.