టీఎస్ఆర్టీసీకి ప్రధాన కార్యాలయం బస్ భవన్, దాని పక్కనే ఉన్న పాత బస్ భవన్ ఖాళీ స్థలం, హకీంపేటలోని అకాడమీ, తార్నాకలోని ఆసుపత్రి సహా పలు ఆస్తులు సంక్రమించాయి. ఎంజీబీఎస్, జేబీఎస్ సహా ఇత బస్‌స్టాండ్లు దీనికి అదనం.
22 బస్సులతో ప్రారంభమై..
నిజాం రాజ్య రైలు, రోడ్డు రవాణా శాఖలో భాగంగా 1932లో ఆర్టీసీ ప్రస్థానం మొదలైంది. అప్పట్లో 22 బస్సులు, 166 మంది సిబ్బంది ఉండేవారు. అనంతరం ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతాలు విలీనమయ్యాక 1958 జనవరి 11న ఏపీయస్ఆర్టీసీ ఏర్పడింది. అంతకుముందు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకంగా ప్రభుత్వ రంగ రవాణా సంస్థ లేదు. ఆంధ్ర ప్రాంతంలో ప్రైవేటు బస్సులే తిరిగేవి.
ప్రపంచంలోనే అత్యధిక బస్సులున్న సంస్థ
ఒక దశలో ఉమ్మడి ఆర్టీసీ ప్రపంచంలోనే అతి ఎక్కువ బస్సులు కలిగిన సంస్థగా వరుసగా గిన్నిస్ రికార్డులు సృష్టించింది. రాష్ట్ర విభజన జరిగిన 2014 జూన్ 2 నాటికి ఆర్టీసీ విభజన పూర్తికాలేదు. ఆర్టీసీ ప్రధాన ఆస్తులు హైదరాబాద్‌లో ఉండిపోవడంతో విభజన సంక్లిష్టమైంది.