తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతోంది. వేసవి సెలవులు కావడంతో శ్రీవారి దర్శనం కోసం కంపార్ట్‌మెంట్లు నిండి.. వెలుపల క్యూలు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రత్యేక దర్శనానికి దాదాపు 5 గంటల సమయం పడుతుండగా, సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.
మంగళవారం ఒక్కరోజే 80,744 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 35,726 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.