గణపతికి ఆకారం లేదు, అందుకే ఆయనను విగ్రహం రూపంలో పూజిస్తారని చెప్పారు. అలాగే ప్రకృతి వైపరీత్యాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నేడు గౌరి పండగ, రేపు వినాయక చవితి అని వెల్లడించారు. సోమవారం వినాయక చవితి వ్రతం చేసుకుంటే ప్రపంచ శాంతి కలుగుతుందని పేర్కొన్నారు.
ఈ రోజు, రేపు అమ్మవారిని, గణపతిని పూజిస్తామని చెప్పారు. ప్రతీ ప్రాణి క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. గణపతి సహస్ర మోదక మహాయాగాన్ని ప్రకృతి శాంతికై చేస్తున్నట్లు వెల్లడించారు. ఇంకా వినాయక చతుర్థి రోజున మట్టి గణపతిని మాత్రమే పూజించాలని పిలుపునిచ్చారు.