మాజీ ముఖ్యమంత్రి, తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు వైకాపాపై విమర్శనాస్త్రాలు సంధించారు. ట్విట్టర్లో ఆయన ఇలా పేర్కొన్నారు. '' వైకాపా నేతలు తెదేపా కార్యకర్తల ఇళ్ళపై దాడులు చేస్తున్నారు, భూములు సాగు చేసుకోనివ్వడం లేదు. గ్రామాలను ఖాళీచేసి వెళ్ళిపోవాలని బెదిరిస్తున్నారు. ఏంటీ దౌర్జన్యం? మనది స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం. పౌరులందరికీ నివసించే హక్కుంది. ప్రజలందరికీ భావవ్యక్తీకరణ స్వేఛ్చ ఉంది.
పల్నాడుతో సహా ఇతర ప్రాంతాలలో వైసీపీ కారణంగా నివాసం కోల్పోయిన బాధితులందరికీ, గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు గుంటూరు శిబిరంలో ఆశ్రయం కల్పిస్తాం. తర్వాత నేనే దగ్గరుండి బాధితులను ఆయా గ్రామాలకు వెంటబెట్టుకు వెళ్తాను. బాధితులందరికీ న్యాయపరంగా రక్షణ కల్పిస్తాం.''