పబ్‌జీ గేమ్‌.. మెదడులో రక్తస్రావం.. తిండి మానేసి, నిద్రలేకుండా?

ఆదివారం, 1 సెప్టెంబరు 2019 (11:46 IST)
పబ్‌జీ గేమ్‌కు చాలామంది చిన్నారులు బానిసలైపోతున్నారు. ఇలా పబ్ జీ గేమ్‌కు అడిక్ట్ అయిన 18 ఏళ్ల కుర్రాడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. పబ్‌జీ ఎఫెక్ట్‌తో అతనికి మెదడులో రక్తస్రావం కావడంతో కదలలేని పరిస్థితికి చేరుకున్నాడు. 
 
వివరాల్లోకి వెళితే..18 ఏళ్ల కేశవర్ధన్ వనపర్తికి చెందిన యువకుడు. డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు. నెలరోజులుగా పబ్‌జీ ఆడుతూ.. తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. వారం రోజుల క్రితం జ్వరంతో పాటు వాంతులయ్యాయి. దీంతో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. చివరికి మెదుడుపై తీవ్ర ఒత్తిడికి గురై పరిస్థితి విషమించింది. కాలు, చేయి కదపలేని స్థితికి వెళ్లిపోయాడు. 
 
బాధితుడి తల్లి ఆందోళనకు గురై ఆగష్టు నెల 26వ తేదీన సికింద్రాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించింది. న్యూరో ఫిజీషియన్‌ ఆధ్వర్యంలోని వైద్యుల బృందం యువకుడిని ఐసీయూకు తరలించి అత్యవసరంగా చికిత్స అందించారు. మెదడుకు రక్త ప్రసరణ చేసే నరాల్లో ఇబ్బంది రావడంతో యువకుడి ఆరోగ్య పరిస్థితి విషయమించినట్టు గుర్తించారు. 
 
పబ్ జీకి అలవాటు పడి సమయానికి తినకపోవడం వల్ల, నిద్రలేమితో శరీరంలో సోడియం, పోటాషియం స్థాయిలు తగ్గి అది చివరికి మెదడుపై ప్రభావం చూపినట్టు వైద్యులు తేల్చారు. ప్రస్తుతం ఆ యువకుడు ప్రాణాపాయ స్థితిలో వున్నాడని వైద్యులు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు