18 నుంచి శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు

శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (07:48 IST)
చిత్తూరు జిల్లా తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో ఈనెల 18నుంచి 20వ తేది వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఏడాది పొడవునా ఆలయంలో నిర్వహించిన పలు క్రతువుల్లో తెలిసో తెలియకో జరిగిన దోషాల నివారణకు మూడు రోజులపాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.

కొవిడ్‌ నిబంధనల మేరకు ఆలయంలో పవిత్రోత్సవాలు ఏకాంతంగా జరగనున్నాయని టీటీడీ అధికారులు తెలిపారు. పవిత్రోత్సవాల సందర్భంగా 14న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరగనుంది. 17న సాయంత్రం అంకురార్పణ, 18న పవిత్ర ప్రతిష్ఠ, 19, పవిత్ర సమర్పణ, 20న మహాపూర్ణాహుతి నిర్వహిస్తారు.

చివరిరోజు మధ్యాహ్నం 3నుంచి 5గంటల వరకు స్నపన తిరుమంజనం, ఆలయ ప్రాంగణంలో చక్రస్నానం నిర్వహించనున్నారు.

పవిత్రోత్సవాలను పురస్కరించుకుని 14న జరిగే కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం సందర్భంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, 17న కల్యాణోత్సవం, లక్ష్మీపూజ, ఊంజల్‌సేవ, సాయంత్ర బ్రేక్‌ దర్శనాన్ని, 20నుంచి మూడు రోజులు పాటు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఉదయం, సాయంత్రం బ్రేక్‌ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు