అక్రమార్కులకు రెండేళ్ల జైలు శిక్ష వేసేలా ఆర్డినెన్స్ తీసుకువచ్చేలా నేటి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనుంది. రేపట్నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక వారోత్సవాలు ఇసుక సమస్యల పరిష్కారం కోసం ఈనెల 14 నుంచి 21 వరకు ఇసుక వారోత్సవాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
రాష్ట్ర సరిహద్దుల్లో ప్రతి చోటా చెక్పోస్టులు ఏర్పాటు చేసేలా, కలెక్టర్లు, ఎస్పీలు, ఆర్ అండ్ బీ, ఏపీ ఎండీసీ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ఎక్కువ ధరకు అమ్మితే రెండేళ్లు జైలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఇసుక ధరలు కంటే ఎవరైనా ఎక్కువ ధరలకు అమ్మినా, అక్రమ రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అలాంటి వారికి రెండేళ్ల జైలు శిక్ష వేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.