స్థానికులు వారిద్దరిని సర్ది చెప్పి పంపించారు. మహేశ్వరరెడ్డి రాత్రి 10 గంటల ప్రాంతంలో బాలాజీనగర్‌లోని తన బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి విజయలక్ష్మినగర్‌కు వస్తున్నారు. ఇదే దారిలో తన మిత్రుడు కనిపిస్తే బైకును ఆపి మాట్లాడుతున్నారు. చంద్రకాంత్ కారులో తన అన్న, మరి కొంతమంది మిత్రులతో కలిసి అటుగా వెళ్తూ మహేశ్వర రెడ్డిని చూశారు.
సాయంత్రం జరిగిన గొడవను మనసులో పెట్టుకున్న చంద్రకాంత్.. మహేశ్వర రెడ్డితో మరోసారి గొడవకు దిగారు. వెంట తెచ్చుకున్న కత్తితో మహేశ్వరరెడ్డి తలపై నరికారు. మహేశ్వరరెడ్డి తీవ్రంగా గాయపడి కిందపడ్డారు. స్థానికులు మహేశ్వర రెడ్డిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.