విజయవాడలో 135 మందికి జర్నలిస్టులకు రెండోరోజు పరీక్షలు

బుధవారం, 29 ఏప్రియల్ 2020 (15:23 IST)
జర్నలిస్టులకు చేస్తున్న కరోనా టెస్టులు విజయవాడ ఐఎంఏ హాలులో రెండో రోజూ కొనసాగాయి. బుధవారం నాడు 135 మంది జర్నలిస్టులు యాంటీ బాడీ టెస్టులు చేయించుకున్నట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) అధ్యక్షుడు డాక్టర్‌ మధుసూదన శర్మ తెలిపారు.

మంగళ, బుధవారం రెండు రోజుల్లో మొత్తం 301 మందికి పరీక్షలు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. జిల్లా మొత్తంగా శాంపిల్స్ కోవిడ్ ఆస్పత్రికి రావడంతో పరీక్ష ఫలితాలు తెలిపేందుకు ఆలస్యం అయ్యేఅవకాశం ఉందన్నారు.

అంతే కాకుండా ఐఎంఏ హాలులో రక్త పరీక్ష ఫలితాలు ఆలస్యం అవుతున్న కారణంగా ప్రభుత్వం  సూచనల మేరకు ఐఎంఏ హాలులో జరిగే టెస్టులు రేపటి నుంచి నిలిపి వేస్తున్నామన్నారు. తిరిగి ప్రకటించే వరకూ ఎవరూ రావొద్దని ఆయన తెలిపారు. ప్రజావైద్యశాల డాక్టర్ రాం ప్రసాద్, ఏపీయూడబ్ల్యూజే అర్బన్ కార్యదర్శి కొండా రాజేశ్వరరావు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు పర్యవేక్షించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు