38 మంది వ్యభిచార గృహ నిర్వాహకులు, బ్రోకర్లు, విటులు సహా పలువురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ మహిళ వ్యభిచారం నిర్వహిస్తోందన్న సమాచారంతో మదనపల్లెలోని పలు వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహించినట్టు మదనపల్లె డీఎస్పీ రాజేంద్రప్రసాద్ విలేకరులకు తెలిపారు.
13 మంది నిర్వాహకులు, ఐదుగురు బ్రోకర్లు, 9 మంది విటులు, 11 మంది యువతులను అరెస్ట్ చేసి వారివద్ద నుంచి రూ.40 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. ఒక్కో మహిళకు రోజుకు వెయ్యి రూపాయలు ఇస్తూ పెద్ద ఎత్తున సెక్స్ రాకెట్ నడుపుతున్నట్టు పేర్కొన్నారు.