ఏటీఎస్, పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులు మహబూబ్, అంజాద్‌ఖాన్, జకీర్‌ఖాన్, అఖిల్, సాలిఖ్, మజీబ్‌షేక్, ఖలీద్, మజీద్ హతమయిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరపాలని ఓవైసీ డిమాండ్ చేశారు.
ఇంకా భోపాల్ సెంట్రల్ జైలు నుంచి పారిపోయి మధ్యప్రదేశ్ పోలీసుల చేతిలో హతమైన సిమీ ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌పై ఓవైసీ స్పందిస్తూ.. ఎన్‌కౌంటర్ జరిగిన తీరుపై తమకు అనుమానాలున్నాయన్నారు. ఎన్‌కౌంటర్‌పై మధ్యప్రదేశ్ పోలీసులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ చెబుతున్న వాదన తమకు అంగీకారం కాబోదని చెప్పారు.