Tirupati Stampede తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్లకై తొక్కిసలాట: ఆరుగురు భక్తులు మృతి

ఐవీఆర్

బుధవారం, 8 జనవరి 2025 (22:19 IST)
Tirupati Stampede తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీలో అపశ్రుతి చోటుచేసుకున్నది. ఈ నెల 10వ తేదీన వైకుంఠ ఏకాదశి (vaikuntha ekadashi 2025) సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం టిక్కెట్ల కోసం తిరుపతిలో భక్తులు పోటెత్తారు. ఈ టిక్కెట్ల జారీ సమయంలో ఒక్కసారిగా భక్తులు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకూ 6 మంది భక్తులు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుంది.
 
టిక్కెట్ల కోసం పెద్ద ఎత్తున భక్తులు చేరడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని రుయా ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఒకరు తమిళనాడులోని సేలంకి చెందినవారుగా గుర్తించారు.

క్యూలో కనీసం 5 వేల మంది భక్తులు టిక్కెట్ల కోసం వున్నారు. అందర్నీ క్యూ లైన్లలో పంపమని చెప్పినా ఒక్కసారిగా గేటు తీసారు. దాంతో తొక్కిసలాట జరిగి 10 మంది చనిపోయారని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. ఇది రామానాయుడు కాలేజి దగ్గర జరిగిందని చెప్పారు.

బిగ్ బ్రేకింగ్ న్యూస్

తిరుపతిలో తొక్కిసలాట.. ముగ్గురు భక్తులు మృతి

తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీలో అపశ్రుతి

పెద్ద ఎత్తున భక్తులు చేరడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది.. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరికొందరికి గాయలు

గాయపడిన వారిని ఆసుపత్రికి తరలింపు

మృతుల్లో ఒకరు… pic.twitter.com/ZqdmAASqWi

— Telugu Scribe (@TeluguScribe) January 8, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు