45 రోజుల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని ఆరుసార్లు పాము కాటేసింది. వివరాల్లోకి వెళితే చంద్రగిరి మండలం దోర్నంకంబాల పంచాయతీ మల్లయ్యపల్లి ఆంధ్రవాడకు చెందిన వెంకటేష్, తన భార్య వెంకటమ్మ, కుమారుడు జగదీష్ తండ్రితో కలిసి వ్యవసాయ పనులు చేసుకుంటూ అటవీప్రాంతం సమీపంలోని కొట్టంలో జీవనం సాగిస్తున్నారు.
గతంలో వెంకటేష్ రెండు సార్లు, ఆయన తండ్రి, ఆయన భార్య వెంకటమ్మ, కుమారుడు జగదీష్ ఒక్కోసారి పాముకాటుకు గురయ్యారు. తాజాగా జగదీష్‌ను రెండోసారి పాము కాటేసింది. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.