ఈ శిక్షతో పాటు పాముతో కరిపించి హత్య చేసినందుకు మరో పదేళ్లు, సాక్ష్యాధారాలను నాశనం చేసేందుకు ప్రయత్నించినందుకు మరో ఏడేళ్లు కఠిన కారాగార శిక్షను విధిస్తున్నట్లు కోర్టు తెలిపింది. దీంతో.. పాటు సూరజ్‌కు రూ.5 లక్షల జరిమానా విధించింది. కోర్టు తీర్పు వెలువరించడంతో ఉదయం 11.40కి కొల్లాం జిల్లా జైలుకు సూరజ్‌ను తరలించారు.
ఉత్రా తల్లిదండ్రులు కూడా తమ కూతురిని అన్యాయంగా పొట్టనపెట్టుకున్న సూరజ్‌కు ఉరే సరి అని చెప్పారు. ఈ కేసులో సాక్ష్యాధారాలను పూర్తి స్థాయిలో పరిశీలించిన అనంతరం.. కోర్టు ఘటన జరిగిన ఒక సంవత్సరం, ఐదు నెలల నాలుగు రోజుల తర్వాత తీర్పును వెలువరించింది.