కుమారస్వామి పామురూపంలో వచ్చాడనే నమ్మకంతో తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడలో నాగుపామును ప్రజలంతా కొలిచారు. కానీ ఆ నాగుపాము మృతి చెందింది. 27 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పాము గురించే అందరూ చర్చించుకున్నారు. అయితే ఆ పాము మాత్రం అనారోగ్యం కారణంగా తిండి లేక, పడగ విప్పి ఆడుతూ ప్రాణాలు కోల్పోయింది.
కానీ ఆ పాము బతికివున్న 27 రోజులు జనాలు దాన్నిచూసేందుకు వేల సంఖ్యలో వచ్చారు. ప్రత్యేక పూజలు చేశారు. సుబ్రహ్మణ్యస్వామి ప్రతిరూపంగా స్థానికులు, నాగ భక్తులు పామును కొలిచారు. కానీ బుధవారం పామును ఆరోగ్య పరిస్థితిని వెటర్నరీ డాక్టర్లు పరీక్షించారు. అనారోగ్యంతో ఉందంటూ చికిత్స చేసేందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు
ఇంకా పామును అక్కడి నుంచి తీసుకెళ్లనివ్వకుండా స్థానికులు, భక్తులు అడ్డుకున్నారు. అయితే అధికారుల తీరువల్లే పాము చనిపోయిందని స్థానికులు ఆందోళన చేపట్టారు. 26 రోజుల క్రితం దుర్గాడలోని ఓ రైతు పొలంలో పడగ విప్పి నాట్యం చేస్తున్న పాముకు మహిమాన్విత శక్తులు ఉన్నాయని భావించారు. పాము ఎవరిపై దాడి చేయకుండా.. కనీసం కాటు వేసేందుకు కూడా ప్రయత్నించలేదు. దీంతో స్థానికులంతా పూజలు చేయడం ప్రారంభించారు.