త్వరలో కరణం మల్లీశ్వరి బయోపిక్‌

మంగళవారం, 2 జూన్ 2020 (09:08 IST)
2000సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ విభాగంలో కాంస్య పతకం, ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డ్‌ సృష్టించిన కరణం మల్లీశ్వరి జీవితాన్ని సినిమా రూపంలో ఆవిష్కరించనున్నారు.

ఎంతో మంది మహిళలకు స్ఫూర్తినిచ్చిన కరణం మల్లీశ్వరి బయోపిక్‌ను పాన్‌ ఇండియా మూవీగా రూపొందించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు ఎం.వి.వి.సినిమా, కె.ఎఫ్‌.సి బ్యానర్స్‌పై ఎం.వి.వి.సత్యనారాయణ, కోనవెంకట్‌ నిర్మిస్తున్నారు.

ఈ బయోపిక్‌కు సంజనా రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కోనవెంకట్‌ ఈ చిత్రానికి రచయితగా కూడా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రంలో నటించబోయే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటించనున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు