మార్కెటింగ్‌ శాఖ మరింత పని చేయాలి: మంత్రి పేర్ని నాని

మంగళవారం, 2 జూన్ 2020 (08:05 IST)
మార్కెటింగ్‌ శాఖను రాష్ట్ర  ప్రభుత్వం బలోపేతం చేస్తుందని, మార్కెటింగ్‌ శాఖలో తీసుకువచ్చిన సంస్కరణలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను పాలకవర్గం  మరింత చురుగ్గా అమలయ్యేలా ఉత్సాహంగా పనిచేయాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని) సూచించారు. 
 
మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ యార్డ్  ఛైర్మెన్ షేక్ వహీద్ అధ్యక్షతన సోమవారం సాయంత్రం తొలి  సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. మార్కెట్ యార్డ్ పరిధిలోని గ్రామాలలో రైతులకు నాసిరకం విత్తనాలపై అవగాహనా కల్గించేలా ఫ్లెక్సీలు కట్టించేలా చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులు చూడాలన్నారు.

మచిలీపట్నం మార్కెట్ యార్డ్ 14 ఎకరాల విస్తీర్ణం అని, 12 సువిశాల గోడౌన్లు ఉన్నాయని 26 గ్రామాలు మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్‌ యార్డ్  పరిధిలో ఉన్నట్లు తెలిపారు.  

ఎంతోకాలంగా ఆర్ అండ్ బి మార్కెట్ యార్డ్ కు అద్దె చెల్లించడం లేదని  జీ ఓ 67 ప్రకారం వారిపై వత్తిడి తీసుకొచ్చి తక్షణమే ఆ బకాయిని వసూలు చేయాలనీ కమిటీ తీర్మానం చేసింది.

అలాగే 10 సంవత్సరాల నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను గోడౌన్లలో ఉంటున్నాయని, మార్కెట్ యార్డ్ సమావేశపు మందిరంలో ఫర్నిచర్ నిమిత్తం లక్ష రూపాయలను కేటాయించనున్నట్లు తీర్మానించారు.

ఈ సమావేశంలో కె డి సి సి బ్యాంకు చైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు, మార్కెట్ యార్డ్ కమిటీ వైస్ చైర్మన్ తోట సత్యనారాయణ, మాజీ  జెడ్ పి టీ సి లంకె వెంకటేశ్వరావు (ఎల్వీఆర్), మచిలీపట్నం మార్కెట్ యార్డ్ మాజీ  చైర్మన్ మోకా భాస్కరరావు,  సెక్రటరీ మండల వ్యవసాయ అధికారిణీ నూరున్నీసా తదితరులు పాల్గొన్నారు.
 
రైతు భరోసా నగదు జమ విషయంలో అప్రమత్తత అత్యవసరం
రైతు భరోసా నగదు నిజమైన రైతుల ఖాతాలలోనే పడాలని రైతులు, అర్హులైన కౌలుదార్లు, సాగుదార్లకు నగదు జమ చేయడంలో అధికారులు  పూర్తి పారదర్శకత  వహించానని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని సూచించారు.

స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రైతు భరోసా నగదు బదిలీ విషయమై  కరగ్రహారం గ్రామం గూర్చి మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 244 ఎకరాల వ్యవసాయ భూమి గల ఈ ప్రాంతంలో 60 ఎకరాలు వరిపంటను రైతులు సాగు చేస్తున్నారన్నారు.

ఆ తర్వాత వేరుశెనగ, సరుగుడు, రొయ్యల చెరువులు ఈ గ్రామంలో ఉన్నాయన్నారు. మొత్తం 614 బ్యాంకు ఖాతాలలో ఉన్నాయని ఇందులో లబ్దిదారులు స్థానికంగా, 48 మంది బౌతికంగా లేనందున 142 ఖాతాలు  రద్దు చేయాలనీ అన్నారు.

రైతు భరోసా నగదు రెండు  రొయ్యల చెరువుల లబ్ధిదారులకు ఎలా పడిందని మండల వ్యవసాయ అధికారిణీ ఈ సందర్భంగా మంత్రి ప్రశ్నించారు. ఎటువంటి అవకతవకలు తలెత్తకుండా అధికారులు రైతు భరోసా నగదు లబ్ధిదారుల ఖాతాలలో పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో బందరు ఆర్డీఓ ఖాజావలి, తహసీల్దార్  సునీల్ బాబు, ఆర్ ఐ లు  యాకూబ్,  వనజాక్షి, మండల సర్వేయర్ రాజాబాబు, కరగ్రహారం గ్రామ పార్టీ ఇంచార్జ్ శొంఠి ఫరీద్ తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు