చిత్తూరు జిల్లా పలమనేరు మండలం నెల్లిపట్ల గ్రామ పంచాయితీ పరిధిలోని జంగాల అగ్రహారంలో ఓ యువకుడు పాస్టర్‌గా పనిచేస్తున్నాడు. అదే గ్రామంలోని ఓ యువతితో ఆరేళ్లపాటు సన్నిహితంగా మెలిగాడు. పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించి శారీరకంగా దగ్గరయ్యాడు. ఆమెకు గర్భం వచ్చిందని తెలుసుకుని, అబార్షన్ చేయించాడు. అయితే కొన్నాళ్లుగా ఆమెకు కనిపించకుండా తప్పించుకు తిరగడం మొదలుపెట్టాడు. పాస్టర్ ప్రవర్తనపై అనుమానంతో ఆమె గ్రామపెద్దల వద్ద పంచాయితీ పెట్టింది.
పాస్టర్ ట్రైనింగ్ పూర్తయిన వెంటనే పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. అయితే ఇచ్చిన మాట పక్కన పెట్టి, కొన్నాళ్లకు మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అతడి చేతిలో మోసపోయిన సదరు మహిళ బైరెడ్డిపల్లి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పాస్టర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.