అనంతరం ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. కాగా, సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు గరుడవాహనంపై స్వామివారు దర్శనమిస్తారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో రాజేంద్రుడు, ఏఈవో రవికుమార్ రెడ్డి, కంకణ బట్టార్ ఏ.టి. పార్థసారధి దీక్షితులు, సూపరింటెండెంట్ వెంకటాద్రి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ మునీంద్రబాబు, అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.