మాజీ డిప్యూటీ సీఎంకు తలనొప్పి.. అబ్బా ఎటు చూసినా ఈ గొడవేలంటి..?

గురువారం, 12 మే 2022 (14:02 IST)
ఏపీలో మంత్రివర్గ విస్తరణకు తర్వాత మాజీ డిప్యూటీ సీఎంకు తలనొప్పి తప్పట్లేదు. మూడేళ్లు.. డిప్యూటీ సీఎం పదవిలో ప్రశాంతంగా గడిపిన ధర్మాన క్రిష్ణదాస్‌కి.. పక్క నియోజకవర్గాల పంచాయతీ పెద్ద తలనొప్పిగా మారిందనే టాక్ వినిపిస్తోంది.
 
శ్రీకాకుళం జిల్లా వైసీపీలో కీలక నేతగా ధర్మాన కృష్ణదాస్‌కు పేరుంది. మొన్నటిదాకా.. డిప్యూటీ సీఎం పదవి కూడా ఉండేది. కానీ.. మంత్రి వర్గ విస్తరణ తర్వాత కీలకమైన జిల్లా అధ్యక్షుడి బాధ్యతలను అప్పగించారు. స్వయంగా.. ఆయనే జిల్లా వైసీపీలో అసంతృప్తులున్నారంటూ.. చేసిన కామెంట్స్.. పార్టీలో హాట్ టాపిక్‌గా మారాయి.
 
ముఖ్యంగా.. ఇచ్చాపురం, టెక్కలి, ఎచ్చెర్ల, ఆముదాలవలస, పాతపట్నంలో.. వర్గపోరు క్రిష్ణదాస్‌కి తలనొప్పిగా మారిందనే ప్రచారం జరుగుతోంది.  
 
ఇటీవలే జరిగిన జడ్పీటీసీ ఉపఎన్నికల్లో.. ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమారుడిని.. వైసీపీ నేతలే ఓడించారనే టాక్ ఉంది. ఇవన్నీ.. ధర్మాన క్రిష్ణదాస్‌కి సవాల్‌గా మారాయనే చర్చ నడుస్తోంది.
 
వచ్చే ఎన్నికల బాధ్యతంతా.. జిల్లా అధ్యక్షులదేనని.. అధినేత జగన్ చెప్పడం ధర్మానను మరింత కలవరపెడుతోంది. మరి ఈ తలనొప్పిని ధర్మాన ఎలా తగ్గించుకుంటారో అనేది తెలియాలంటే వేచి చూడాలి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు