శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అపశృతి: తొక్కిసలాట.. గాయాలు

బుధవారం, 7 డిశెంబరు 2022 (12:04 IST)
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అపశృతి చోటుచేసుకుంది. కార్తీక దీపోత్సవంలో మంటలు ఎగసి పడటంతో భక్తుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలైనాయి. తమిళ కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వరాలయంలో చొక్కాని ఉత్సవం నిర్వహించారు. 
 
ఈ ఉత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ ఉత్సవంలో భాగంగా ఆలయ పరిసరాల్లో దాదాపు 20 అడుగుల ఎత్తులో పెద్ద దీపాన్ని ఏర్పాటు చేశారు. కానీ దీపోత్సవం నిర్వహణలో అనూహ్యంగా మంటలు ఎగసిపడటంతో అక్కడున్న భక్తులు భయాందోళనతో పరుగులు తీశారు. దీంతో వారిని సెక్యూరిటీ అదుపు చేయలేకపోయారు. 
 
దీంతో భక్తుల మధ్య తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో మహిళా సెక్యూరిటీ గార్డ్ చెయ్యి విరిగింది. ఇంకా పలువురు భక్తులకు గాయాలైనాయి. గాయపడ్డ వారిలో ముగ్గురు ఆలయ సిబ్బంది, ఐదుగురు భక్తులకు గాయాలైనట్లు ప్రాథమికంగా తెలిసింది. వీరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు