కొవ్వూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జగనన్న అమ్మ ఒడి పథకాన్ని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత ప్రారంభించారు. ఈ సందర్భముగా మంత్రి మాట్లాడుతూ.. పిల్లల చదువులకు ఏ పేదింటి తల్లులు బాధ పడకూడదని, బ్రతుకులు మార్చే గుడి పాఠశాల అని, పాఠశాలలో చదివే పిల్లలకు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదని, మన ముఖ్యమంత్రి జగనన్న ప్రవేశపెట్టిన పథకం అమ్మ ఒడి పథకమని అన్నారు.
కష్టపడి చదివించే తల్లులకు, చదివే పిల్లలకు ఈ పథకం ఒక సంజీవని లాంటిదని ఆమె తెలిపారు. కొవ్వూరు నియోజకవర్గంలోని 200 పాఠశాలలు, కాలేజీలలో చదివే విద్యార్థిని విద్యార్థులు సుమారుగా 28,411 మంది ఉంటే వీరిలో 19 వేల ఐదు వందల నలభై మంది లబ్ధి పొందడం జరిగిందని తెలిపారు.