సోమవారంవారం శ్రీ విగ్నేశ్వర దేవస్థానం, శ్రీ లక్ష్మీ గణపతి సేవాసమితి భవానిపురం వారి ఆధ్వర్యంలో స్వాతి థియేటర్ వద్ద శ్రీ లక్ష్మీ గణపతి కళ్యాణ మండపంలో ప్రతిభ గల పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రి విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు.
ఈ కార్యక్రమంలో లక్ష్మీ గణపతి సేవాసమితి అధ్యక్షులు వెలంపల్లి సూర్యనారాయణ గారు, బచ్చు కోటేశ్వరరావు, గోపిశెట్టి మల్లయ్య, సాదు సత్యనారాయణ, నాళం చలపతిరావు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.