పెన్ను విషయంలో తీవ్ర మనస్తాపానికి గురైన అనూష హాస్టల్ భవనంలోని నాలుగో ఫ్లోర్ నుంచి ఒక్కసారిగా కిందకు దూకింది. హాస్టల్ సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థిని అనూష మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టి దర్యాప్తు చేస్తున్నారు.