ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌ను నిరసిస్తూ తాడేపల్లిలోని సీఎం జగన్ అధికారిక నివాసం వద్ద టీడీపీ అనుబంధ విభాగాలు, పలు సంఘాల విద్యార్థులు ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
చలో తాడేపల్లి కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత అక్కడకు చేరుకుంటున్నారు. దీంతో పాత టోల్‌గేట్ చౌరస్తా వద్ద వారిని పోలీసులు అడ్డుకుంటుండటంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం జరిగింది.
పలువురిని పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లే మార్గంలో ముగ్గురు ఎస్పీలు, డీఎస్పీలతో పాటు దాదాపు 1,000 మంది పోలీసులు మోహరించారు.