ఈ ప్రమాదానికి కారణమైన స్టెరిన్ చాలా విషపూరితమైనది. ప్లాస్టిక్ ఇంజనీరింగ్ పరిశ్రమల్లో స్టెరిన్ వాయువును ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఈ గ్యాస్ వల్లే పాలిమర్స్ ప్లాంట్‌లో పేలుళ్లు జరిగి ఉంటాయని అంచనా వేస్తున్నారు. పాలీస్టెరీన్ ప్లాస్టిక్స్, రెజిన్స్ ఉత్పత్తుల్లో స్టెరిన్‌ను వాడుతుంటారు.
ఈ విషవాయువును పీల్చితే.. నాసికా చర్మం, కండ్లు తీవ్ర మంటకు గురవుతాయి. ఉదర సంబంధిత రుగ్మతలు కూడా డెవలప్ అవుతాయి. విశాఖ ప్లాంట్‌లో లీకైన గ్యాస్ సుమారు మూడు కిలోమీటర్ల మేరకు వ్యాపించినట్లు తెలుస్తున్నది. కనీసం అయిదు గ్రామాలపై ఆ విషవాయువు ప్రభావం పడింది. ఇది న్యూరో టాక్సిన్ ప్రభావాన్ని చూపుతుంది.
ఈ గ్యాస్‌ను పీల్చడం వల్ల మనిషి నిర్జీవంగా మారిపోతాడు. ఎటూ కదలేని పరిస్థితి వస్తుంది. కేవలం పది నిమిషాల్లోనే మనిషి ప్రాణం పోయే అవకాశాలు ఉన్నాయి. 1961లో హిందుస్తాన్ పాలిమర్స్ కంపెనీని ఏర్పాటు చేశారు. 1978లో యూబీ గ్రూపుతో విలీనం చేశారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి రెండు కిలోమీటర్ల దూరంలోనూ తీవ్ర ఇబ్బందులు తలెత్తినట్లు గుర్తించారు.