విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో భారీగా గ్యాస్ లీకైన ఘటనలో ఇప్పటికే ఎనిమిది మృతి చెందారని.. సుమారు 5వేల మంది అస్వస్థతకు గురయ్యారని తెలిసింది. పాలిమర్స్ బాధితులతో కేజీహెచ్ నిండిపోయింది. ఒక్కో బెడ్‌పై ముగ్గురు చొప్పున చిన్నారులకు డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. అంబులెన్స్‌లు, వ్యాన్లు, కార్లలో బాధితులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఈ విషవాయువు ప్రభావంతో కళ్లు కనపడక బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.