తమ పార్టీ నేత కామినేని శ్రీనివాస్, ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను కలవడం పట్ల బీజేపీ ఎంపీ సుజనా చౌదరి వివరణ ఇచ్చారు. ఒకరు తమ పార్టీ నేత అని, మరొకరు తమ కుటుంబానికి దగ్గరి వ్యక్తి అని, వారిద్దరిని కలవడం చట్ట విరుద్ధమైన చర్య కాదన్నారు.
లాక్డౌన్ సమయంలో తన కార్పొరేట్ కార్యాలయాన్ని హోటల్ పార్క్ హయత్‌కు మార్చానని... దీంతో, తనను కలిసేందుకు వీరిద్దరూ అక్కడికే వచ్చారని చెప్పారు. వీరిద్దరూ తనతో విడివిడిగా సమావేశమయ్యారని తెలిపారు. ఇదేమీ చట్ట విరుద్ధమైన చర్య కాదని అన్నారు. ఈ మేరకు ఆయన ప్రెస్‌నోట్ ద్వారా తెలియజేశారు.
ముఖ్యంగా, కామినేని శ్రీనివాస్ తన పార్టీకే చెందిన నేత కాగా, నిమ్మగడ్డ రమేష్ కుమార్ తమ కుటుంబానికి దగ్గర వ్యక్తి అని సుజనా చెప్పారు. వీరిద్దరూ తనను కలవడంలో తప్పేముందని ప్రశ్నించారు.