తిరుమలలో సుందరకాండ పారాయణం, కరోనా నుంచి ఉపశమనం కలగాలంటూ...?
సోమవారం, 31 మే 2021 (19:47 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా నుంచి విముక్తి లభించాలని.. కరోనా సమూలంగా నాశనం కావాలంటూ తిరుమలలో సుందరకాండ పారాయణం నిర్వహించారు. టిటిడి తిరుమల ప్రత్యేక కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనగా 40 మంది వేదపండితులు పారాయణాన్ని నిర్వహించారు.
హనుమంతుడు మహేంద్రగిరి పర్వతం నుంచి లంఘించి సీతాన్వేషణ కోసం ఏ విధంగా అవిశ్రాంతంగా కర్తవ్యదీక్ష చేశారో అదే విధంగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 16 గంటల పాటు నిరంతరాయంగా అఖండ సుందరకాండ పారాయణాన్ని టిటిడి నిర్వహించింది.
వేదపండితులు శ్లోకం, హవనం నిర్వహించారు. అఖండ పారాయణం సంధర్భంగా కళ్యాణోత్సవం, సహస్ర్తదీపాలంకరణ సేవను రద్దు చేశారు. గతంలో కూడా టిటిడి కరోనా నిర్మూలన కావాలంటూ యాగాలను తిరుమలలో నిర్వహించింది.