టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ కేసులో క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం తుది తీర్పును వెలువరించింది. ఈ ఇద్దరు న్యాయమూర్తులు విభన్నమైన తీర్పులను వెల్లడించింది. అదేసమయంలో త్రిసభ్య ధర్మాసనానికి పంపించాలని ప్రధాన న్యాయమూర్తికి సిఫార్సు చేసింది. ఈ మేరకు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా నేతృత్వంలోని ధర్మాసనం 17ఏ పై భిన్నాభిప్రాయాలతో కూడిన తీర్పును వెలువరించింది.
టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సెక్షన్ 17ఏ అన్వయించడంలో తమకు వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయని న్యాయమూర్తులు తెలిపారు. దీంతో తదుపరి చర్యల కోసం సీజేఐకు నివేదిస్తున్నామంటూ తీర్పును వెలువరించారు. గతంలో జరిగిన నేరాలకు 17ఏ వర్తించదని, చట్టం వచ్చిన తర్వాతే 17ఏ వర్తిస్తుందని జస్టిస్ బేలా ఎం త్రివేది తీర్పునివ్వగా, చంద్రబాబుకు 17ఏ వర్తిస్తుందని జస్టిస్ అనిరుధ్ బోస్ తీర్పునిచ్చారు.