తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో ఓ దారుణం జరిగంది, తల్లిదండ్రులు లేని ఓ యువతిపై సొంత బాబాయే అత్యాచారానికి పాల్పడ్డాడు. వావి వరసలు మరిచి సొంతవారే లైంగికంగా వేధించడంతో బాధిత యువతి(23) ఆత్మహత్యకు పాల్పడింది.
సొంత బాబాయ్, పెదనాన్న కొడుకు కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురిచేయడంతో తట్టుకోలేక, ఎవరికీ చెప్పుకోలేక నిస్సహాయ స్థితిలో బాధితురాలు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది.