ఆరోపణలు నిరాధారం భద్రత పరికరాల కొనుగోళ్లకు సంబందించిన తనపై ఆరోపణలు నిరాధారమని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కొనుగోళ్ల ప్రక్రియ నిబంధనల ప్రకారం కొనసాగుతుందని తెలిపారు. కొనుగోళ్ల కోసం ఓ అధికారిని నియమిస్తారని... ఆడిట్, ఫైనాన్స్ క్లియరెన్స్ అయిన తర్వాతే ఫైల్ ఇంటెలిజెన్స్ అదనపు డీజీకి వస్తుందని వివరించారు.
ప్రాథమిక విచారణ జరపకుండా.. కనీసం తన వివరణ తీసుకోకుండా సస్పెండ్ చేయడం రాజ్యాంగ ఉల్లంఘనేనని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. సస్పెన్షన్ విషయంపై టీవీలు, పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో చర్చకు దారితీశాయని.. తన కుటుంబ సభ్యులను సైతం బలిపశువుల్ని చేశారని వాపోయారు.
బోస్నియా, కొసోవాలో శాంతి కోసం పని చేసినందుకు.. ఐరాస శాంతి మెడల్ వచ్చిందని పేర్కొన్నారు. రాజకీయ ఒత్తిళ్లతో చేసిన సస్పెన్షన్ను.. రద్దు చేయాలని కోరారు. తనకు రావాల్సిన వేతన బకాయిలు విడుదల చేసేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.