తమిళనాడు రాష్ట్రంలోని నాగర్‌కోయిల్‌లో ఓ విషాదం జరిగింది. గొంతులో ఇడ్లీ ఇరుక్కుని విద్యార్థిని మృతి చెందింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నాగర్‌కోవిల్ సమీపంలో ఇలంగడ ప్రాంతానికి చెందిన జయ్‌లాణి, ఇర్ఫానా అనే దంపతుల కుమార్తె అఫ్రిన్ (13). అదే ప్రాంతంలో ఉన్న పాఠశాలలో ఆరో తరగతి చదువుతుంది. గురువారం ఉదయం తల్లితో కూర్చొని మాట్లాడుతూ నవ్వుకుంటూ ఇడ్లీ తినడం ప్రారంభించింది.