విశ్వంలో ఏలియన్స్ ఉన్నాయన్న శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఇకలేరు...

బుధవారం, 14 మార్చి 2018 (09:28 IST)
ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కన్నుమూశారు. ఆయన వయసు 76 ఏళ్లు. విశ్వంలో ఏలియన్స్ ఉన్నాయని హాకింగ్ అనేక సిద్ధాంతాలను ప్రతిపాదించారు. హాకింగ్‌కు ముగ్గురు పిల్లలు. లూసీ, రాబర్ట్, టిమ్‌లు తమ తండ్రి హాకింగ్ చనిపోయినట్లు ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు. 
 
1942, జనవరి 8న ఇంగ్లండ్‌లోని ఆక్స్ ఫోర్డ్‌షైర్‌లో జన్మించిన ఆయన సెయింట్ ఆల్బన్స్ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఆపై ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో బీఏ, కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో పీహెచ్డీ చేశారు. 
 
హాకింగ్ రేడియేషన్, పెన్‌రోజ్, హాకింగ్ ఫార్ములా, హాకింగ్ ఎనర్జీ, గిబ్సన్స్ - హాకింగ్ అన్సాట్జ్, ధ్రోన్ హాకింగ్ ప్రీస్కిల్ బెట్ వంటి ఆయన సిద్ధాంతాలు ఉత్సాహిక శాస్త్రవేత్తలకు మార్గదర్శకాలయ్యాయి. ముఖ్యంగా, తన ఖగోళ సిద్ధాంతాలతో ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. 
 
1965లో జేన్ విల్డీని వివాహం చేసుకున్న ఆయన, 1995లో విడాకులు ఇచ్చి అదే సంవత్సరం ఎలానీ మాసన్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆమెకు 2006లో విడాకులు ఇచ్చారు. హాకింగ్‌కు ముగ్గురు పిల్లలు. ఆయన మృతితో శాస్త్ర సాంకేతిక శాస్త్రవేత్తలు, పలు దేశాధినేతలు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. 
 
కాగా, హాకింగ్ జీవిత చరిత్ర ఆధారంగా హాలీవుడ్‌లో థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ సినిమాను రూపొందించారు. ఆ ఫిల్మ్‌కు ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. 1963లో హాకింగ్‌కు మోటార్ న్యూరాన్ వ్యాధి సోకింది. ఆ తర్వాత ఆయన వీల్‌చైర్‌కే పరిమితమయ్యారు. వీల్‌చైర్ నుంచి ఆయన అనేక విశ్వరహస్యాలను చేధించారు. క్యాంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఫిజిక్స్ చదవిన హాకింగ్.. అనేక ఖగోళ అంశాలపై సిద్ధాంతాలను ప్రతిపాదించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు