పొరుగు రాష్ట్రాల మహిళలకు ఇప్పటికీ విద్యా హక్కు లేదు: మంత్రి దురైమురుగన్

ఠాగూర్

సోమవారం, 10 మార్చి 2025 (09:04 IST)
తమిళనాడు జనరుల శాఖామంత్రి దురైమురుగన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాల్లో మహిళలకు ఇప్పటికీ విద్యా హక్కు లేదని గుర్తుచేశారు. కానీ, తమిళనాడులో తందైపెరియార్ పోరాటాల ఫలితంగా మహిళలకు విద్యా హక్కు సాధ్యమైందన్నారు. ఆ కారణంగా రాష్ట్రంలో మహిళలు పురోగతి సాధిస్తున్నారని పేర్కొన్నారు. 
 
తమిళనాడు, కేరళలో మహిళల విద్యకు తందై పెరియార్ పోరాటాలు చేసి మార్గదర్శిగా నిలిచారని రాష్ట్రంలో తొలి వైద్యురాలిగా మత్తులక్ష్మి రెడ్డి రికార్డులకెక్కారని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటివరకు మహిళలకు విద్యాహక్కు లేదని మంత్రి దురైమురుగన్ వ్యాఖ్యానించారు. 
 
తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికలు : రాములమ్మకు టిక్కెట్ ఇచ్చిన కాంగ్రెస్ 
 
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం ముగ్గురు అభ్యర్థులను ఆ పార్టీ హైకమాండ్ ఎంపిక చేసింది. ఒక స్థానాన్ని సీపీఐకు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ అభ్యర్థుల పేర్లను ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అధికారికంగా ప్రకటించింది. 
 
తాజాగా ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతికి టిక్కెట్ కేటాయించారు. అలాగే, విజయశాంతితో పాటు అద్దంకి దయాకర్, శంకర్ నాయక్‌లను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పేర్కొంది. 
 
కాగా, ఖాళీకానున్న ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి బీఆర్ఎస్‌కు దక్కనుండగా, నాలుగు కాంగ్రెస్ పార్టీకి లభించనున్నాయి. ఈ నేపథ్యంలో ముగ్గురు జాబితాను ఏఐసీసీ ప్రకటించింది. నాలుగో స్థానాన్ని మిత్రపక్షం సీబీఐకి కేటాయించింది. 
 
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు మార్చి 20వ తేదీన పోలింగ్ జరుగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపడుతారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు