మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ లీగల్ సెల్ నూతన కమిటీ ప్రమాణస్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, వివిధ జిల్లాల న్యాయవాదులు కార్యక్రమానికి హాజరయ్యారు.
అలాంటి అమరావతికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ సరే అన్నారు. చిన్న రాష్ట్రం, విభేదాలు వద్దని అప్పుడు చెప్పి.. ఇప్పుడు 3 రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ధర్మం, న్యాయం కోసం పోరాడుతున్నాం. నేరగాళ్లను కట్టడి చేసేందుకు పోరాడుతూనే ఉంటాం.. దానికి న్యాయవాదుల సహకారం కావాలి అని అన్నారు.